నిలిచిన ఇంధన సరఫరా | fual transpotetion break | Sakshi
Sakshi News home page

నిలిచిన ఇంధన సరఫరా

Sep 2 2016 11:43 PM | Updated on Sep 4 2017 12:01 PM

రామగుండం : కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల పిలుపు మేరకు చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా కుందనపల్లి సమీపంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, హిందుస్థాన్‌ పెట్రోలియం లిమిటెడ్‌ డిపోలలో శుక్రవారం ఉదయం నుంచి ఇంధన సరఫరా నిలిపివేశారు.

రామగుండం : కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల పిలుపు మేరకు చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా కుందనపల్లి సమీపంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, హిందుస్థాన్‌ పెట్రోలియం లిమిటెడ్‌ డిపోలలో శుక్రవారం ఉదయం నుంచి ఇంధన సరఫరా నిలిపివేశారు. సమ్మె నేపథ్యంలో ఇంధన సరఫరాలో కొరత రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంతో సమ్మె రోజు బంక్‌లలో బంద్‌ ప్రభావం కనిపించలేదు. సింగరేణిలో బంద్‌ సంపూర్ణంగా జరగడంతో ఇంధన వినియోగం కూడా తగ్గిందని ఆయిల్‌ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. పట్టణంలోని బ్యాంకులు, పోస్టాఫీసులు మూసేయడంతో ఖాతాదారులు ఇబ్బందులకు గురయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement