మెుదటి నుంచి అన్యాయమే.. | From first time injustice .. | Sakshi
Sakshi News home page

మెుదటి నుంచి అన్యాయమే..

Jul 31 2016 12:25 AM | Updated on Sep 4 2017 7:04 AM

మెుదటి నుంచి అన్యాయమే..

మెుదటి నుంచి అన్యాయమే..

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీల పెత్తనంతోనే బీసీలు వెనుకబడిపోతున్నారని, బీసీలు పుట్టిన నాటి నుంచి పొట్టకూటి కోసం తండ్లాడటమేసరిపోతుందన్నారు. భూపాలపల్లి పట్టణంలోని భారత్‌ ఫంక్షన్‌ హాల్‌లో శనివారం జరిగిన బీసీ చైతన్య సదస్సుకు కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

  • ఓసీల పెత్తనంతోనే బీసీల వెనుకబాటు 
  • చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి
  • రాజ్యాధికారం కోసం బీసీలు ఉద్యమించాలి 
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య 
  • భూపాలపల్లి: స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీల పెత్తనంతోనే బీసీలు వెనుకబడిపోతున్నారని, బీసీలు పుట్టిన నాటి నుంచి పొట్టకూటి కోసం తండ్లాడటమేసరిపోతుందన్నారు. భూపాలపల్లి పట్టణంలోని భారత్‌ ఫంక్షన్‌ హాల్‌లో శనివారం జరిగిన బీసీ చైతన్య సదస్సుకు కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగ రచన సమయంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే న్యాయం జరిగిందని, బీసీలకు మాత్రం అన్యాయం జరిగిందన్నారు. అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించైనా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, లేనిపక్షంలో కేంద్రానికి తమ తడాఖా చూపుతామన్నారు. పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నామినేటెడ్‌ కోటాలో ఆంగ్లో ఇండియన్‌కు సైతం పదవులు అప్పగించి చట్టసభల్లో కూర్చోబెడుతున్న ప్రభుత్వాలు బీసీలకు కనీస గుర్తింపు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. అగ్రకులాలు ప్రభుత్వం నుంచి వందలు, వేల కోట్ల రుణాలు తీసుకొని ఎలా ఎగ్గొట్టాలో ఆలోచిస్తే, బీసీలు రూ. లక్ష రుణం తీసుకుంటే వడ్డీ ఎంత..? తాను చెల్లించగలనా లేదా అని రోజుల తరబడి ఆలోచించేంత అమాయకులన్నారు. ఓసీలు కులాల ను చూసి ఓట్లు వేస్తుంటే బీసీలు పార్టీలను చూ సి ఓట్లు వేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ఆ పద్ధతిని మానుకొని సర్పంచ్‌ నుంచి ఎంపీ స్థా యి వరకు కులాలు, పార్టీలు చూడకుండా బీసీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచిం చారు. తోడేళ్ళను మేకల మందకు కాపలా పెడితే రోజుకో మేకను తింటుందని, ఓసీలు తోడేళ్ళ వంటి వారని, అభివృద్ధి కాగితాలకే పరి మితం అవుతుందన్నారు. తన 40 ఏళ్ళ ఉద్యమ ప్రస్థానంలో ప్రభుత్వాలు, పార్టీలు తనను తీవ్ర ఇబ్బందులు, అవమానాలకు గురిచేశాయని, ఈ విషయాన్ని బయటకు చెప్తే అందరూ అధైర్యపడుతారనే చెప్పలేదని, మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నానని కృష్ణయ్య అన్నారు. బీసీలు వ్యాపార, వాణిజ్య, విద్యా, రాజకీయ రంగాల్లో ఎదగాలని సూచించారు. అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. బీసీౖయెన సిరికొండ మధుసూదనాచారిని గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీని వాస్, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ సిరి కొండ ప్రదీప్, రాష్ట్ర నాయకుడు సాంబారి సమ్మారావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్, నాయకులు ముంజాల రవీందర్, బుర్ర కుమారస్వామి, ఎరుకల గణపతి, పైడిపెల్లి రమేష్, కొడపాక కుమారస్వామి, దాడి మల్లయ్య, దొడ్డపెల్లి రఘుపతి, కంకటి రాజవీరు, తాటి వెంకన్న, వేముల మహేందర్, ఏరుకొండ రాజేంద్రప్రసాద్, పిల్లలమర్రి నారాయణ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement