వాపు చూసి బలుపు అనుకుంటున్నారు: పొన్నం | Former MP Ponnam Prabhakar comments on GHMC Election results | Sakshi
Sakshi News home page

వాపు చూసి బలుపు అనుకుంటున్నారు: పొన్నం

Feb 6 2016 7:43 PM | Updated on Oct 3 2018 7:42 PM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడి విజయం సాధించిందని, వాపును చూసి బలుపనుకోవడం తగదని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

కరీంనగర్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడి విజయం సాధించిందని, వాపును చూసి బలుపనుకోవడం తగదని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాతీర్పుకు కట్టుబడి ఉందని, గెలుపోటములు సహజమని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించే విధంగా టీఆర్‌ఎస్ డివిజన్ల విభజన, రిజర్వేషన్లు చేసి తమకు అనుకూలంగా మలుచుకుందన్నారు. ఇతర పార్టీల నాయకులను ప్రలోభపెట్టి టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారన్నారు. విద్యుత్ బకాయిలు, నీటి పన్నుల రద్దు, అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, డబుల్ బెడ్రూం ఇళ్ల హామీలతో ప్రజలకు మాయమాటలు చెప్పి  అధికార పార్టీ జీహెచ్‌ఎంసీలో గెలిచిందని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement