హోదా కోసం అలుపెరుగని పోరు | Fighting for the special status | Sakshi
Sakshi News home page

హోదా కోసం అలుపెరుగని పోరు

Sep 10 2016 1:23 AM | Updated on Nov 6 2018 5:13 PM

‘ హోదా’ సాధనకు అలుపెరగని పోరాటం చేస్తామని వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నాయకులు పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక హోదా సాధనకు గత రెండు రోజులుగా చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జాతీయ రహదారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు.

ఎస్కేయూ: ‘ హోదా’ సాధనకు అలుపెరగని పోరాటం చేస్తామని వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నాయకులు పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక హోదా సాధనకు గత రెండు రోజులుగా చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జాతీయ రహదారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను  దహనం చేశారు. విభజన అనంతరం రాష్ట్రానికి జవసత్వాలు అందాలంటే హోదా అనివార్యమని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలగాలంటే విరివిగా పరిశ్రమలు నెలకొల్పాలన్నారు. ప్రత్యేక హోదా వస్తే దశాబ్దకాలం పాటు పరిశ్రమలకు రాయితీలు లభిస్తాయన్నారు. కార్యక్రమం లో వైఎస్సార్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం , కార్యదర్శి నరసింహా రెడ్డి, క్రాంతికిరణ్, భానుప్రకాష్‌ రెడ్డి, ఛార్లెస్, అమర్‌నాథ్, సలాం, శ్రీనివాసులు, వెంకట్‌ యా దవ్, అశ్వర్థ, ఓబులేసు, నారాయణ రెడ్డి పాల్గొన్నారు. 
నేడు ఎస్కేయూ, జేఎన్‌టీయూ  బంద్‌:     ప్రత్యేక హోదా సాధన నిమిత్తం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు నేపథ్యంలో  ఎస్కేయూ, జేఎన్‌టీయూల్లో బంద్‌ నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నాయకులు గెలివి నారాయణరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement