నల్లగొండ జిల్లా రాజుపేట మండలం పాముకుంట గ్రామంలో ఓ రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.
రాజుపేట: నల్లగొండ జిల్లా రాజుపేట మండలం పాముకుంట గ్రామంలో ఓ రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. జవలాపురం మహేందర్ (35)కు ఎనిమిది ఎకరాల పొలం ఉంది. మరో ఎనిమిది ఎకరాలకు కౌలుకు తీసుకున్నాడు. పత్తి సాగు చేయగా పంట దిగుబడి రాలేదు. రూ.10 లక్షల వరకు అప్పులు ఉండడంతో తీర్చలేక మనస్తాపం చెందిన అతడు మంగళవారం సాయంత్రం పురుగుల ముందు తాగి ప్రాణాలు కోల్పోయాడు.