విశాఖ స్టీల్ ప్లాంట్లో గురువారం నకిలీ పాసుల వ్యవహారం కలకలం సృష్టించింది.
విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్లో గురువారం నకిలీ పాసుల వ్యవహారం కలకలం సృష్టించింది. నకిలీ పాసులతో ప్లాంట్లోకి ముగ్గురు వ్యక్తులు చొరబడ్డారు. దాంతో గమనించిన అక్కడి భద్రతా సిబ్బంది ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే ప్లాంట్కు సంబంధించిన నకిలీ పాసులను తయారు చేస్తున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ముడిసరుకు చోరీకి యత్నించడంతో ఈ పాసుల వ్యవహారం బయటపడినట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ భద్రతా అధికారులు వెల్లడించారు.