ఉరి వేసుకుని ఉద్యోగి ఆత్మహత్య | employ sucide in hanging | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుని ఉద్యోగి ఆత్మహత్య

Dec 19 2016 10:54 PM | Updated on Sep 4 2017 11:07 PM

ఎర్రగుంట్లలోని ఐసీఎల్‌ కర్మాగారం ఉద్యోగి జి.వేణుగోపాల్‌ నాయుడు(52) ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటనాయుడు సోమవారం తెలిపారు. ఐసీఎల్‌ కర్మాగారంలో ఆయన 25 ఏళ్లకు పైగా మెకానిక్‌గా పని చేస్తుండే వారు. ఐసీఎల్‌ కాలనీలోని ఏ/52 నంబరు గల ఇంటిలో భార్య పిల్లలతో జీవించే వారు.

ఎర్రగుంట్ల: ఎర్రగుంట్లలోని ఐసీఎల్‌ కర్మాగారం ఉద్యోగి జి.వేణుగోపాల్‌ నాయుడు(52) ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటనాయుడు సోమవారం తెలిపారు. ఐసీఎల్‌ కర్మాగారంలో ఆయన 25 ఏళ్లకు పైగా మెకానిక్‌గా పని చేస్తుండే వారు. ఐసీఎల్‌ కాలనీలోని ఏ/52 నంబరు గల ఇంటిలో భార్య పిల్లలతో జీవించే వారు. ఆయనకు భార్య విజయలక్ష్మితోపాటు పిల్లలు సందీప్, సుచరిత ఉన్నారు. వేణుగోపాల్‌ నాయుడు కొంత కాలంగా బీపీ, షుగర్‌తో బాధపడుతుండే వారు. మూడు రోజుల కిందట భార్య తన అమ్మవారి ఇంటికి పోయివస్తానని చెప్పి పిల్లలతో వెళ్లింది. అనారోగ్యంతో జీవితం విరక్తి చెందిన ఆయన ఇంటిలో ఫ్యాన్‌కు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు సోమవారం ఉదయాన్నే వచ్చి చూడగా.. విగత జీవిగా కనిపించారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ వెంకటనాయుడు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.    


 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement