మండలంలోని కృష్ణాపురం, సుమంతాపురం గ్రామాల్లో మంగళవారం కుక్కల దాడిలో సుమారు 30 గొర్రె పిల్లలు మృతి చెందినట్లు గొర్రెల కాపలాదారులు స్థానిక విలేకర్లకు చెప్పారు. ఇంటి వద్ద కంచె ఏర్పాటు చేసి ఆ కంచెలో నెల రోజుల నుంచి రెండు నెలలు వయసున్న పిల్లలను ఉంచామని, గొర్రెల మందను మేతకు తీసుకుని వెళ్లిపోయామని తెలిపారు. ఇంతలోనే వీధుల్లో ఉన్న కుక్కలు కంచె దాటుకుని వెళ్లి పిల్లలపై దాడి చేసి కరిచాయని పేర్కొన్నారు
కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లల మృతి
Aug 9 2016 11:19 PM | Updated on Sep 29 2018 4:26 PM
	ఎల్.ఎన్.పేట: మండలంలోని కృష్ణాపురం, సుమంతాపురం గ్రామాల్లో మంగళవారం కుక్కల దాడిలో సుమారు 30 గొర్రె పిల్లలు మృతి చెందినట్లు గొర్రెల కాపలాదారులు స్థానిక విలేకర్లకు చెప్పారు. ఇంటి వద్ద కంచె ఏర్పాటు చేసి ఆ కంచెలో నెల రోజుల నుంచి రెండు నెలలు వయసున్న పిల్లలను ఉంచామని, గొర్రెల మందను మేతకు తీసుకుని వెళ్లిపోయామని తెలిపారు. ఇంతలోనే వీధుల్లో ఉన్న కుక్కలు కంచె దాటుకుని వెళ్లి పిల్లలపై దాడి చేసి కరిచాయని పేర్కొన్నారు. గ్రామస్తులు వెంబడించినా ఫలితం లేకుండా పోయిందని గొర్రెల కాపలాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణాపురం గ్రామానికి చెందిన బొమ్మాళి సిమ్మన్నకు చెందిన ఆరు, ముద్ద అప్పన్నకు చెందిన పది, దాసరి పోలోడుకు చెందిన నాలుగు, సుమంతాపురం గ్రామానికి చెందిన తాడిన అప్పయ్య, వంజరాపు సోమేష్‌లకు చెందిన పది గొర్రె పిల్లలు కుక్కల దాడిలో మరణించాయని తెలిపారు. 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
