నమ్మించి లోబర్చుకుని... మరో పెళ్లికి సిద్ధ పడి.. | Dirty lover cheating | Sakshi
Sakshi News home page

నమ్మించి లోబర్చుకుని... మరో పెళ్లికి సిద్ధ పడి..

Mar 13 2016 7:57 PM | Updated on Sep 3 2017 7:35 PM

నమ్మించి లోబర్చుకుని...   మరో పెళ్లికి సిద్ధ పడి..

నమ్మించి లోబర్చుకుని... మరో పెళ్లికి సిద్ధ పడి..

కాలేజీకి వెళుతున్న అమ్మాయిని.. ప్రేమ పేరుతో నమ్మించి బుట్టలో వేసుకున్నాడా ఘనుడు.

నాలుగు రోజుల క్రితం వేరే యువతితో నిశ్చితార్థం
పత్రికలు పంచుతుండగా యువకుడ్ని నిలదీసిన బాధితురాలు
న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన వైనం

 
 
 సోమందేపల్లి : కాలేజీకి వెళుతున్న అమ్మాయిని.. ప్రేమ పేరుతో నమ్మించి బుట్టలో వేసుకున్నాడా ఘనుడు. తన వాంఛను తీర్చుకున్నాడు. ఆనక మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు. విషయం తెలిసిన బాధితురాలు నిలదీసింది.  బాధితురాలు, పోలీసుల తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన ఓ దళిత బాలిక ప్రతిరోజు పెనుకొండలోని జూనియర్ కాలేజీకి, ఇదే మండలం వెలుగమాకులపల్లికి చెందిన నర్సింహమూర్తి(20) ఆటోలో వెళ్లేది. అదే అదనుగా అతను నిన్ను ప్రేమిస్తున్నానంటూ ఆ విద్యార్థినిని నమ్మించాడు.

ఏడాది నుంచి వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. అనంతరం మనం పెళ్లి చేసుకుందామంటూ ఆమెను లోబర్చుకుని తన వాంఛ తీర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజుల క్రితం అతను మరో యువతితో నిశ్చితార్థమైంది. పెళ్లి పత్రికలు పంచుతుండగా గమనించిన బాధితురాలు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశావంటూ నిలదీసింది. దీంతో మనం పారిపోయి పెళ్లి చేసుకుందామంటూ బాధితురాలిని నమ్మించాడు.

శుక్రవారం ఆమెను ఆటోలో తీసుకెళుతుండగా గోరంట్ల సమీపంలో అతని స్నేహితులు ఆటోను నిలిపారు. ఈ సందర్భంగా వారు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి చేయి లాగారని, దీంతో స్థానికులు వచ్చి కాపాడినట్లు బాధితురాలు ఆరోపిస్తూ విలేకరుల ఎదుట రోదించింది. తనను చంపేందుకే తీసుకెళ్లినట్లు ఆమె కన్నీరుమున్నీరైంది. ఈ ఘటనపై శనివారం తల్లిదండ్రులతో కలిసి పోలీసు స్టేషన్‌కు వచ్చింది. తనకు న్యాయం చేయాలని పోలీసుల్ని కోరింది. కొందరు కుల పెద్దలు స్టేషన్‌లోనే దుప్పటి పంచాయితీ చేసినట్లు సమాచారం. తమ కుమార్తెకు ఆ యువకుడితో పెళ్లి చే యించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement