పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డీఈఓ | Deo checking in exam center | Sakshi
Sakshi News home page

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డీఈఓ

Mar 30 2017 11:19 PM | Updated on Sep 5 2017 7:30 AM

పట్టణంలో పదవ తరగతి పరీక్షా కేంద్రాలను డీఈఓ శైలజ తనిఖీ చేశారు. ఈనెల 17వ తేదీ నుంచి జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు గురువారం ముగిశాయి.

కమలాపురం:  పట్టణంలో పదవ తరగతి పరీక్షా కేంద్రాలను డీఈఓ శైలజ తనిఖీ చేశారు. ఈనెల 17వ తేదీ నుంచి జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు గురువారం ముగిశాయి. చివరి రోజు సోషియల్‌ పేపర్‌- 2 పరీక్ష జరుగుతున్న కేంద్రాలను ఆమె పరిశీలించారు. అలాగే స్క్వాడ్‌ అధికారి జాఫర్‌ సాదిక్‌ కూడా పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. మూడు పరీక్షా కేంద్రాల్లో 655 మంది పరీక్షలు రాశారు. 11 రోజుల పాటు పరీక్షలు ప్రశాంతంగా జరగడంతో ఇటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

పోల్

Advertisement