ఉద్యోగ భద్రత కల్పించాలి | demand on Job safety | Sakshi
Sakshi News home page

ఉద్యోగ భద్రత కల్పించాలి

Sep 2 2016 5:17 PM | Updated on Sep 4 2017 12:01 PM

ఉద్యోగ భద్రత కల్పించాలి

ఉద్యోగ భద్రత కల్పించాలి

విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భత్రద కల్పించాలని ఆంధ్రవిశ్వవిద్యాలయం బోధనేతర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వాక కోటిరెడ్డి అన్నారు.

ఏయూక్యాంపస్‌: విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భత్రద కల్పించాలని ఆంధ్రవిశ్వవిద్యాలయం బోధనేతర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వాక కోటిరెడ్డి అన్నారు. స్వార్వత్రిక సమ్మెలో భాగంలో శుక్రవారం ఉదయం  ఏయూ పరిపాలనా భవనం వద్ద నిరసన వ్యక్తం చేశారు. పెన్షన్‌విధానంలో పాత పద్దతిని అనుసరించాలని డిమాండ్‌ చేశారు. టైంస్కేల్, 28 రోజుల విధానంలో పనిచేస్తున్న వారికి రెగ్యులర్‌ చేయాలన్నారు. కరువు భత్యాన్ని రాష్ట్ర్ర ప్రభుత్వం కాలానుగుణంగా ప్రకటించాలని కోరారు. వర్సిటీ ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు అందించాలని, ఎల్‌టిసి సదుపాయం కల్పించాలని, జిఓ 90 రద్దు చేయాలని, ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇవ్వాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ వ్యతిరేక విధానాలు విడనాడాలన్నారు. 
ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేస్తూ, ప్రై వేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయన్నారు. విద్య అందరికీ చేరువ కావాలంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు పరిపుష్టి సాధించాలన్నారు. విశ్వవిద్యాలలయలలో నూతన కోర్సులు ప్రవేశ పెడుతూ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందన్నారు. దీనికి అనుగుణంగా బోధనేతర ఉద్యోగుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పాలక మండలి సభ్యులుగా బోధనేతర సిబ్బందికి ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. ఉద్యోగులు సమస్యను పరిష్కరించే దిశగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఏయూఈయూ చైర్మన్‌ శ్రీనివాస్, ఉపాద్యక్షుడు బి.తాతారావు, ప్రదీప్, బాబా, హాస్టల్‌ ఉద్యోగుల సంఖ్య అద్యక్షుడు ఓమ్మి అప్పారావు, చైర్మన్‌ చద్రశేఖర రెడ్డి, సి.హెచ్‌ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement