జనావాసాల్లో జింక | deer fall in pit at nalgonda | Sakshi
Sakshi News home page

జనావాసాల్లో జింక

Jan 6 2016 9:11 AM | Updated on Jul 11 2019 8:55 PM

నూతన భవన నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి జింకకు గాయాలయ్యాయి.

నల్లగొండ: నూతన భవన నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి జింకకు గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ పట్టణంలోని తిరుమల థియేటర్ సమీపంలో బుధవారం వెలుగుచూసింది. సమీపంలోని లతీఫ్ షావలి గుట్టపై సంచరిస్తున్న జింకను కుక్కలు తరమడంతో.. జనావాసాల్లోకి వచ్చి ప్రమాదవశాత్తు గుంతలో పడింది. ఇది గుర్తించిన స్థానికులు టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుంటలో పడిన జింకను రక్షించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement