సెలవులొచ్చాయోచ్‌.. | dasara holidays came and students halchal | Sakshi
Sakshi News home page

సెలవులొచ్చాయోచ్‌..

Sep 20 2017 10:21 PM | Updated on Jul 29 2019 6:03 PM

సెలవులొచ్చాయోచ్‌.. - Sakshi

సెలవులొచ్చాయోచ్‌..

దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం నుంచి దసరా సెలవులు మంజూరు కావడంతో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం నుంచి దసరా సెలవులు మంజూరు కావడంతో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. సెలవులొచ్చాయోచ్‌.. అంటూ ఎగిరి చిందేశారు. పుస్తకాల సంచి వీపున వేసుకుని ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు బుధవారం సాయంత్రం పరుగుపరుగున ఇళ్లకు చేరుకుంటే.. పెట్టెబేడా సర్దుకుని వివిధ కార్పొరేట్‌ స్కూళ్లు, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు బస్టాండ్‌కు తరలివచ్చారు. పిల్లలను పిలుచుకెళ్లేందుకు సుదూర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు తరలివచ్చారు. విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో జిల్లా కేంద్రం అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్‌ కిటకిటలాడింది. 12 రోజుల పాటు సెలవులు రావడం‍తో ఇన్నాళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టిన చిట్టి మెదళ్లకు కాసింత ఊరట లభించినట్లైంది.
- సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement