ఫీజు సొమ్ము క్లర్క్‌ స్వాహా.. | clerk cheated students fees in anantapur degree college | Sakshi
Sakshi News home page

విద్యార్థుల పరీక్ష ఫీజు సొమ్ము స్వాహా

Oct 14 2017 7:08 AM | Updated on Nov 9 2018 4:20 PM

clerk cheated students fees in anantapur degree college - Sakshi

ప్రిన్సిపల్‌తో మాట్లాడుతున్న విద్యార్థులు

అనంతపురం, పెనుకొండ: పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీజు సొమ్మును  క్లర్క్‌ స్వాహా చేశాడు. హాల్‌ టిక్కెట్లు రాకపోవడంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకెళితే... డిగ్రీ బీకాం కంప్యూటర్స్, జనరల్‌ బీకాం కోర్సులకు సంబంధించి 140 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు గాను ఇటీవల సబ్జెక్టుకు రూ. 250 చొప్పున  క్లర్క్‌ శ్రీనివాసులుకు చెల్లించారు. శనివారం నుంచి పరీక్షలు ప్రారంభం కానుండటంతో హాల్‌టిక్కెట్లు తీసుకోవడానికి 20 మంది విద్యార్థులు కళాశాల వద్దకు వచ్చారు. అయితే క్లర్క్‌ వద్ద ఉన్న హాల్‌టికెట్లన్నీ పరిశీలించగా విద్యార్ధుల హాల్‌ టిక్కెట్లు కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థులు  ప్రిన్సిపల్‌ నాగలింగారెడ్డిని ప్రశ్నించారు. ఫీజు చెల్లించినా హాల్‌ టిక్కెట్లు ఎందుకు రాలేదని నిలదీశారు.  దీంతో ప్రిన్సిపల్‌ హాల్‌ టికెట్ల కోసం పంపిన విద్యార్థుల వివరాలను కంప్యూటర్‌ జాబితాలో  పరిశీలించగా పలువురు విద్యార్ధుల పేర్లు జాబితాలో కనిపించలేదు.

వారి ఫీజు సొమ్ము కూడా స్వాహా అయినట్లు బయటపడింది. విషయం పెద్దది కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, వారి బంధువులు, రాజకీయ నాయకులు, తహసీల్దార్‌ హసీనా సుల్తానా, ఎస్‌ఐ జనార్ధన్‌ తదితరులు కళాశాల వద్దకు చేరుకున్నారు. ప్రిన్సిపల్‌ నాగలింగారెడ్డిని అడిగారు. సమాధానం చెప్పుకోలేకపోయిన ప్రిన్సిపల్‌... క్లర్క్‌ శ్రీనివాసులును పిలిచి ఎలా జరిగిందో వివరించాలని ప్రశ్నించారు. దీనికి స్పందించిన క్లర్క్‌ విద్యార్థుల జాబితా ఎలా మిస్సయ్యిందో తెలియదని, సమయం ఇస్తే తానే ఫీజు  డబ్బు చెల్లిస్తానని సమాధానం ఇచ్చాడు. అయితే నేటి నుంచి జరిగే పరీక్షల సంగతి ఏమిటని ప్రశ్నించగా ఆయన సమాధానం రాలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రిన్సిపల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్జనల భర్జనల అనంతరం నేటి నుంచి జరిగే పరీక్షలకు డిగ్రీ బోర్డ్‌ నిబంధనల మేరకు ఫైన్‌తో  ఫీజు అంతా తామే చెల్లిస్తామని, విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాలని  ప్రిన్సిపల్‌ హామీ ఇవ్వడంతో  విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు శాంతించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement