రూ.7కోట్లతో బీటీ రోడ్డు | construct BT Road worth of Rs 7 crore | Sakshi
Sakshi News home page

రూ.7కోట్లతో బీటీ రోడ్డు

Apr 10 2017 1:59 PM | Updated on Sep 5 2017 8:26 AM

రూ.7కోట్లతో బీటీ రోడ్డు

రూ.7కోట్లతో బీటీ రోడ్డు

కొత్తపల్లి మండలం ఎలగందుల–ఐలవానిపల్లి(ఖాజీపూర్‌) వరకు తెలంగాణ స్టేట్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ రూ.7కోట్ల నిధులతో బీటి రోడ్డును నిర్మిస్తున్నట్లు కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తెలిపారు.

► భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ‘గంగుల’
కొత్తపల్లి(కరీంనగర్‌): కొత్తపల్లి మండలం ఎలగందుల–ఐలవానిపల్లి(ఖాజీపూర్‌) వరకు తెలంగాణ స్టేట్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ రూ.7కోట్ల నిధులతో బీటి రోడ్డును నిర్మిస్తున్నట్లు కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తెలిపారు. మండలంలోని ఖాజీపూర్‌లో రూ.4 కోట్ల బీటిరోడ్డు పనులకు ఆదివారం భూమిపూజ చేశారు. ఖాజీపూర్‌లోని ఇసుకక్వారీతో పంటలు పాడవుతున్నాయని మంత్రి హరీష్‌రావుకు విన్నవించగా.. టీఎస్‌ఎండీసీ కింద రోడ్డు మంజూరు చేశారని గుర్తు చేశారు.

ఈ రోడ్డు నిర్మాణంతో ప్రయాణదూరం తగ్గుతుందన్నారు. ఖాజీపూర్‌–సిరిసిల్ల, ఖాజీపూర్‌–ఎలగందుల–కరీంనగర్‌లకు సులువైన రవాణా సౌకర్యం ఏర్పడుతుందని చెప్పారు. ఖాజీపూర్‌కు రవాణా సౌకర్యంలేని పరిస్థితుల నుంచి కోట్ల రూపాయలతో రోడ్లు, మౌలిక వసతులు కల్పించుకునే పరిస్థితికి వచ్చామన్నారు. అభివృద్ధి పనులకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఇళ్లు, భూములు కోల్పోయిన వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

2019 ఎన్నికల నాటికి నియోజకవర్గంలోని రోడ్లన్నంటినీ సుందరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఎంపీపీ వాసాల రమేశ్, జెడ్పీటీసీ ఎడ్ల శ్రీనివాస్, సర్పంచ్‌ రామగిరి అలువేనిమంగ శేఖర్‌రావు, ఏఎంసీ వైస్‌చైర్మన్ జె.రాజేశ్వర్‌రావు, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు తుల బాలయ్య తదితరులు పాల్గొన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement