మండలంలోని పెంబి భీమన్న చెరువులో నీటిని నింపే కాలువలో పేరుకుపోయిన పూడికతీత పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది.
ఎట్టకేలకు పూడిక తీత పనులకు మోక్షం
Aug 9 2016 11:34 PM | Updated on Jun 4 2019 5:04 PM
మందపల్లి(ఖానాపూర్) : మండలంలోని పెంబి భీమన్న చెరువులో నీటిని నింపే కాలువలో పేరుకుపోయిన పూడికతీత పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. చెరువుకు నీటి సరఫరా అయ్యే సరస్వతి కాలువ డీ–27 ఉప కాలువలో రెండు కిలోమీటర్ల మేర పేరుకుపోయిందని పూడిక తొలగించాలని గ్రామస్తులు, రైతులు ఇటీవల ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్ దష్టికి తీసుకెళ్లారు.
దీంతో రైతుల సమస్యను టీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పాకల రాంచందర్ ఎమ్మెల్యేకు వివరించడంతో ఎస్పారెస్పీ అధికారులతో మాట్లాడి పెంబి రైతులకు సాగు నీరు అందించాలని కోరారు. ఎస్సారెస్పీ ఎస్‌ఈ టీ సత్యనారాయణ సంబంధిత అదికారులతో కలిసి స్వయంగా పెంబి, మందపల్లి గ్రామాల్లోని కాలువను పరిశీలించి సమస్యను గుర్తించారు.
దీంతో ఎస్‌ఈ ఆదేశంతో అంచనాలు వేసిన అధికారులు మంగళవారం పెంబి కాలువలో పూడికతీత పనులు ప్రారంభించారు. జిల్లా ఉపాధ్యక్షుడు రాంచందర్ రైతులతో కలిసి కొబ్బరికాయ కొట్టి పూడిక తీత పనులు ప్రారంభించారు. త్వరలో పనులు పూర్తవుతాయని తద్వారా నీరు చేరుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీఈ జగదీశ్వర్, ఏఈ రవికుమార్‌నాయక్, జేఈ సంజీవ్, పెంబి రైతులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement