ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వండి | chance the mlc elaction | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వండి

Sep 24 2016 11:07 PM | Updated on Aug 29 2018 6:26 PM

ఊట్కూర్‌ : రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానికుడిగా అవకాశం ఇవ్వాలని తెలంగాణ పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌ రెడ్డి కోరారు. శనివారం సాయంత్రం బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు.

  • టీఎస్‌ పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి
  • ఊట్కూర్‌ : రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానికుడిగా అవకాశం ఇవ్వాలని తెలంగాణ పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌ రెడ్డి కోరారు. శనివారం సాయంత్రం బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన 2048 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, జీఓ 11ద్వారా 2000 ఉపాధ్యాయ పోస్టులు రావాల్సివుదని ఆరోపించారు. ప్రభుత్వం స్పెషల్‌ డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు పాలమూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో  నెలకొన్న విద్యా సమస్యలను పట్టించుకోలేదని, దీంతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఉపాధ్యాయునిలకు రెండేళ్ల చైల్డ్‌ కేర్‌ సెలవులు ఇవ్వాలని కోరారు. దసరా కానుకగా పీఆర్‌సీ బకాయిలను మంజూరు చేయాలని, భాష పండితులకు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో ఉపాధ్యాయులు లేక 23 ఉర్దు మీడియం పాఠశాలలు మూతపడ్డాయని అన్నారు. స్థానికుడిగా ఎన్నికల్లో గెలిపిస్తే విద్యాభివద్ధికి కషిచేస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి మరికెంటి బాల్‌రాజ్, నాయకులు నారాయణరెడ్డి, రఘురాంగౌడ్, జనార్దన్, సుధాకర్, ఆంజనేయులు, సస్సేన, విశ్వనాథ్, రేణుక, జగన్నా«ద్, రవూఫ్, జలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement