చైనా అమ్మాయి.. రచ్చమర్రి అబ్బాయి
చైనా అమ్మాయిని రచ్చమరి అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
- ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట
రచ్చమర్రి(మంత్రాలయం రూరల్): చైనా అమ్మాయిని రచ్చమరి అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామానికి చెందిన నరసింహులు, శివమ్మ దంపతుల రెండో కుమారుడు జాషువా అలియాస్ లక్ష్మప్ప ఐదేళ్ల క్రితం సాఫ్ట్‌వేర్ ఉద్యోగం నిమిత్తం చైనాదే«శానికి వెళ్లాడు. చైనాలోని గ్వాంగ్ని రాష్ట్రం, యులిన్ జిల్లా, శానాన్ మండలం షిన్‌చున్ గ్రామానికి చెందిన లీసుఫెన్‌ను ప్రేమించాడు. వీరిద్దరూ గురువారం ఉదయం రచ్చమర్రిలోని స్వగృహం వద్ద సీఎస్‌ఐ చర్చి పాస్టర్ దేవదానం ఆధ్వర్యంలో వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర సభ్యుడు వై.ప్రదీప్‌రెడ్డితో పాటు గ్రామస్తులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.