ప్రొద్దుటూరులో చైన్‌ స్నాచింగ్‌ | chain snacing in Proddutur | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరులో చైన్‌ స్నాచింగ్‌

Jan 17 2017 11:56 PM | Updated on Aug 11 2018 4:36 PM

పట్టణంలోని శ్రీరాంనగర్‌లో మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సోముల లక్షుమ్మ టీ దుకాణం నిర్వహిస్తోంది.

ప్రొద్దుటూరు క్రైం: పట్టణంలోని శ్రీరాంనగర్‌లో మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సోముల లక్షుమ్మ టీ దుకాణం నిర్వహిస్తోంది. మంగళవారం ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో ఉన్న తాళి బొట్టు సరుడును లాక్కొని పరుగెత్తాడు. దొంగ దొంగా అని ఆమె అరిచేలోపే అతను కనిపించకుండా వెళ్లిపోయాడు. తాళిబొట్టు సరుడు సుమారు 40 గ్రాములు ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్‌ సీఐ బాలస్వామిరెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement