మృత్యుంజయుడు! | bus and bike accident | Sakshi
Sakshi News home page

మృత్యుంజయుడు!

Sep 12 2017 11:24 PM | Updated on Jun 1 2018 8:45 PM

మృత్యుంజయుడు! - Sakshi

మృత్యుంజయుడు!

ఈ ఫొటో చూడండి. బస్సు టైరుకింద ఉన్న బైకు ఎలా నుజ్జునుజ్జు అయిందో. సుమారు 30 అడుగుల దూరం బైకును అలానే బస్సు లాక్కెళ్లింది.

– అతివేగంగా వచ్చి బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
– 30 అడుగుల దూరం బైకును లాక్కెళ్లిన బస్సు
– నుజ్జునుజ్జు అయిన బైకు..స్వల్పగాయాలతో బయటపడ్డ చోదకుడు


ఈ ఫొటో చూడండి. బస్సు టైరుకింద ఉన్న బైకు ఎలా నుజ్జునుజ్జు అయిందో. సుమారు 30 అడుగుల దూరం బైకును అలానే బస్సు లాక్కెళ్లింది. బైకే ఇలా దెబ్బతినిందంటే దీన్ని నడుపుతున్న వ్యక్తికి ఎంతటి ప్రమాదం జరిగిందోననే ఆందోళన చెందక తప్పదు. ఈ ప్రమాదం చూసిన ప్రతి ఒక్కరూ ఎంతమందికి ప్రాణహాని జరిగిందని ఆరా తీయడం కనిపించింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బైకు నడుపుతున్న యువకుడు చిన్నపాటి గాయాలతో బయట పడ్డాడు. ఈ యువకుడిని చూసిన ప్రతి ఒక్కరూ మృత్యుంజయుడని అన్నారు. ఆర్టీసీ డ్రైవరు నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు, ప్రయాణికులు చెబతున్నారు. మంగళవారం  మధ్యాహ్నం 12 గంటల సమమయంలో నగర శివారు టీవీ టవరు సమీపంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

అనంతపురం: కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అనంతపురం నుంచి ప్రయాణికులతో బయల్దేరింది. టీవీ టవరు వద్దకు వెళ్లగానే ముందు వెళ్తున్న ఓ వాహనాన్ని బస్సు డ్రైవర్‌ ఓవర్‌టేక్‌ చేయబోయాడు. అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న తపోవనానికి చెందిన రిటైర్డ్‌ బ్యాంకు మేనేజర్‌ కుమారుడు మోహన్‌ప్రసాద్‌ అనే యువకుడు ఎగిరి పక్కకు పడిపోయాడు. బైకు మాత్రం బస్సు టైరు కింద ఉండిపోయింది. ఊహించని పరిణామంతో గందరగోళానికి గురైన డ్రైవరు బస్సును నియంత్రించడంలో భాగంగా పూర్తిగా కుడివైపునకు తీసుకెళ్లాడు. అదృష్టవశాత్తూ ఈ సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలూ రాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ పోలీసులు వచ్చి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించారు. బస్సు డ్రైవర్‌ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని పలువురు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement