నగరానికి భారీ అతిథి | big vehicle came to city from vizag | Sakshi
Sakshi News home page

నగరానికి భారీ అతిథి

Jul 19 2016 9:56 PM | Updated on Sep 4 2017 5:19 AM

నగరానికి భారీ అతిథి

నగరానికి భారీ అతిథి

నాగపూర్‌ బయలుదేరిన 268 టైర్ల అతిపెద్ద వాహనం మంగళవారం నగర శివారులో ఆగిపోయింది.

సాక్షి,సిటీ బ్యూరో: విశాఖపట్నం పోర్ట్‌ నుంచి భారీ విద్యుత్‌ యంత్రాలతో నాగపూర్‌ బయలుదేరిన 268 టైర్ల అతిపెద్ద వాహనం మంగళవారం నగర శివారులో ఆగిపోయింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద ఘాట్‌ రోడ్డులో ప్రయాణిస్తుండగా ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రోడ్డు మధ్యలోనే వాహనం ఆగిపోయింది. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారి కావడంతో వెనుక వచ్చిన వాహనాలు ఎటూ పోయే మార్గం లేక భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. 30 మంది పర్యవేక్షకులు వెంటనే రంగంలోకి దిగి మరమ్మతు పనులు చేపట్టారు. ఈ భారీ వాహనం మరో 30 రోజుల్లో నాగ్‌పూర్‌కు చేరుకుంటుందని జేఎం బాక్సి గ్రూప్‌ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.   

                                                                        – ఫొటోలు: సోమ సుభాష్‌

                                                                  

వాహనం నిలిచిపోవడంతో స్థంబించిన ట్రాఫిక్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement