గురుకుల పాఠశాలల్లో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా అన్ని వసతులతో విద్యాబోధన అందిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ సహాయ కార్యదర్శి హెచ్.కృష్ణమోహన్ తెలిపారు.
చిలమత్తూరు : గురుకుల పాఠశాలల్లో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా అన్ని వసతులతో విద్యాబోధన అందిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ సహాయ కార్యదర్శి హెచ్.కృష్ణమోహన్ తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన టేకులోడు బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం రూ.3.75 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 9 గురుకుల పాఠశాలలు మంజూరు కాగా ఆరింటిని మత్య్సకారుల పిల్లల కోసం కేటాయించినట్లు చెప్పారు. మరో మూడు రాయదుర్గం మండలం కోనేబావి, మడకశిర మండలం గుండుమల, గుడిబండకు మంజూరయ్యాయన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో ఆయా పాఠశాలల్లో తరుగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రసాద్, జయసింహ నాయుడు, శ్యాంభూపాల్‌రెడ్డి, లేపాక్షి, కొడిగెనహళ్లి ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.