పట్టణ శివారులోని అయ్యలూరు మెట్ట వద్ద బుధవారం ఇద్దరు పాలిటెక్నిక్ విద్యార్థులపై దాడి జరిగింది.
పాలిటెక్నిక్ విద్యార్థులపై దాడి
Dec 7 2016 11:49 PM | Updated on Sep 18 2018 7:45 PM
- ఒకరికి తీవ్రగాయాలు
నంద్యాల: పట్టణ శివారులోని అయ్యలూరు మెట్ట వద్ద బుధవారం ఇద్దరు పాలిటెక్నిక్ విద్యార్థులపై దాడి జరిగింది. ఈ దాడిలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడగా..చికిత్స నిమిత్తం కర్నూలు పెద్దాస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలో మదన్‌మోహన్, వెంకటేశ్వర్లు తృతీయ సంవత్సరం చదువుతున్నారు. కాలేజీ వదిలాక వీరిద్దరు నంద్యాలకు రావడానికి బస్సు కోసం వేచి ఉండగా, ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్‌పై వచ్చి వీరిపై దాడి చేసి రాడ్లతో కొట్టి పరారయ్యారు. మదన్‌మోహన్ తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంకటేశ్వర్లు స్వల్పంగా గాయపడ్డాడు. స్థానికులు వీరిద్దరిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే మదర్‌మోహన్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. రూరల్ ఎస్‌ఐలు గోపాల్‌రెడ్డి, శివాంజల్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రత్యక్ష సాక్షి వెంకటేశ్వర్లు షాక్‌లో ఉండటంతో ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేకున్నారని వీరు చెప్పారు. ఈ సంఘటనకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
Advertisement
Advertisement