
రాష్ట్రస్థాయి పోటీల్లో ‘అనంత’ విజయభేరి
ఇటీవల గుంటూరులో జరిగిన 4వ రాష్ట్ర ర్యాంకింగ్ టోర్నీలో అనంతపురంలోని కోర్టురోడ్డు శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు విజయభేరి మోగించినట్లు ఏజీఎం సుబ్బారెడ్డి తెలిపారు.
అనంతపురం ఎడ్యుకేషన్: ఇటీవల గుంటూరులో జరిగిన 4వ రాష్ట్ర ర్యాంకింగ్ టోర్నీలో అనంతపురంలోని కోర్టురోడ్డు శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు విజయభేరి మోగించినట్లు ఏజీఎం సుబ్బారెడ్డి తెలిపారు. టేబుల్ టెన్నిస్‌లో 7వ తరగతి విద్యార్థి బి.ధార్మిక్ రాష్ట్రస్థాయిలో మొదటిర్యాంకు, æషటిల్‌లో సాయిప్రసాద్, మోహన్‌సాయి, బాస్కెట్‌బాల్ పోటీల్లో ఎన్.హర్ష, నితీశ్, జీవన్, కైఫ్, ఆకాష్, కార్తీక్ పతకాలు సాధించారన్నారు. ఈ మేరకు గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనతో పాటు ప్రిన్సిపల్ రాజశేఖర్ నాయుడు విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో డీన్ సతీష్, ఏఓ గోపాల్, పీఈటీలు అనీఫ్, సురేష్, ఉషారాణి పాల్గొన్నారు.