అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని, ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలని సమతా సైనిక్ దళ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగంబర్ కాంబ్లీ అన్నారు.
-
∙సమతా సైనిక్ దళ్ జాతీయ కార్యదర్శి కాంబ్లి
విద్యారణ్యపురి : అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని, ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలని సమతా సైనిక్ దళ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగంబర్ కాంబ్లీ అన్నారు. బుధవారం హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్‌లో ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ‘అంబేద్కర్ ఆలోచనలు– ఉద్యోగుల పాత్ర’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.
అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. సైనిక్ దళ్ జాతీయ అధ్యక్షుడు జీఎస్ కుమారస్వామి ఈ ఫోరం చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు. సదస్సులో తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ, తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షురాలు నీరాకిషోర్, తెలంగాణ పోలీస్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎస్.విష్ణుమూర్తి, సాదు మహేందర్, ఎల్.రాంచందర్, కంకణాల కవి రాజారావు, వై.కొండల్‌రావు, రౌతు రమేష్‌కుమార్, ఎర్రగట్టు స్వామి, ఆరూరి కుమార్, కె.ఎల్లయ్య, చింత ప్రసాద్‌బాబు, కోలా శ్యాం, ఓ.రాజ్‌కుమార్, గడ్డం రవికుమార్ పాల్గొన్నారు.