అగ్రిగోల్డ్ కేసులో కోర్టుల ఆధ్వర్యంలో దర్యాప్తునకు సీఐడీకి పూర్తి అధికారాలున్నాయని డీజీపీ సాంబశివరావు తెలిపారు.
అగ్రిగోల్డ్ దర్యాప్తులో సీఐడీకి అధికారాలు
Nov 11 2016 6:25 PM | Updated on Aug 11 2018 9:14 PM
విజయవాడ: అగ్రిగోల్డ్ కేసులో కోర్టుల ఆధ్వర్యంలో దర్యాప్తునకు సీఐడీకి పూర్తి అధికారాలున్నాయని డీజీపీ సాంబశివరావు తెలిపారు. సీఐడీ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ ఆస్తుల గుర్తింపు, వేలం ప్రక్రియ కొనసాగుతుందని ఆయన శుక్రవారమిక్కడ చెప్పారు. రాష్ట్రంలో 19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని, వారికి రూ.4వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని డీజీపీ వెల్లడించారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ 30 అమలులో ఉన్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో కాపునేత ముద్రగడ చేపట్టే పాదయాత్రకు అనుమతి లేదని చెప్పారు. జిల్లాలో పాదయాత్రలో అసాంఘిక శక్తులు చొరబడి హింసకు పాల్పడుతారనే సమాచారం తమకు ఉందని అన్నారు. ఇక వైఎస్ఆర్ జిల్లాలో బలిజ శంఖారావం సభకు అనుమతి కోసం పోలీసులకు ఎటువంటి దరఖాస్తు అందలేదని వెల్లడించారు.
Advertisement
Advertisement