ఘనంగా సినీ నటుడు శ్రీహరి జయంతి | actor srihari 's birth anniversary celebrated | Sakshi
Sakshi News home page

ఘనంగా సినీ నటుడు శ్రీహరి జయంతి

Aug 15 2016 7:42 PM | Updated on Sep 4 2018 5:21 PM

సినీ నటుడు శ్రీహరి జయంతిని హిమాయత్ సాగర్ గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.

హిమాయత్‌సాగర్ గ్రామ ప్రజలకు సినీ నటుడు స్వర్గీయ శ్రీహరికి మధ్య ఉన్న సంబంధం ఎనలేనిదని ఎంపీపీ తలారీ మల్లేష్ వెల్లడించారు. శ్రీహరి జయంతిని హిమాయత్‌సాగర్ గెస్ట్‌హౌజ్ వద్ద సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలోఆయన మాట్లాడుతూ శ్రీహరి తన ప్రతి చిత్రాన్ని హిమాయత్‌సాగర్ గ్రామంలో షూటింగ్ నిర్వహించేవరన్నారు. గ్రామంలోని పలువురిని పేరు పేరునా పిలిచి పలకరించేవారన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement