తాళ్లపూడి : మండలంలోని వేగేశ్వరపురం–బల్లిపాడు రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దేవం గ్రామానికి చెందిన తిగిరిపల్లి గంగాధర్ (28) అనే వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Nov 14 2016 2:36 AM | Updated on Apr 3 2019 7:53 PM
తాళ్లపూడి : మండలంలోని వేగేశ్వరపురం–బల్లిపాడు రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దేవం గ్రామానికి చెందిన తిగిరిపల్లి గంగాధర్ (28) అనే వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. తాళ్లపూడి ఎస్సై జె.సతీష్ తెలిపిన వివరాలు ప్రకారం.. పెద్దేవం గ్రామానికి చెందిన తిగిరిపల్లి గంగాధర్, యండపల్లి రాజు రాత్రి సమయంలో తాళ్లపూడి నుంచి మోటార్ బైక్‌పై పెద్దేవం వెళుతుండగా వేగేశ్వరపురం శివారు బల్లిపాడు వద్ద మోటార్‌సైకిల్ అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. గంగాధర్‌కు తలకు బలమైన గాయం కావడంతో కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు చెప్పారు. వెనుక ఉన్న రాజుకు స్వల్ప గాయాలయ్యాయి.
Advertisement
Advertisement