ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడిగా గుంటూరు నగరానికి చెందిన ఎ.సి.వి.గురవారెడ్డి ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడిగా గుంటూరు నగరానికి చెందిన ఎ.సి.వి.గురవారెడ్డి ఎన్నికయ్యారు. గుంటూరులోని ఆప్టా జిల్లా కార్యాలయంలో ఆదివారం సంఘ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా గుంటూరు ఎంఈవో సీహెచ్.జగన్నాథకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎ.జి.ఎస్. గణపతిరావు (విజయనగరం), అసోసియేట్ అధ్యక్షుడిగా టి.వి.రమణారెడ్డి (వైఎస్సార్ కడప), ఆర్థిక కార్యదర్శిగా ఎన్.విష్ణువర్ధన్ రెడ్డి (అనంతపురం), అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య (ఏఐపీటీఎఫ్) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఎల్. జగన్నాథం (విజయనగరం), ఆప్టా రాష్ట్ర సమన్వయకర్తగా చల్లా ప్రసాదరెడ్డి (వైఎస్సార్ కడప) ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల ప్రక్రియకు 13 జిల్లాల నుంచి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ఎన్నికల పరిశీలకునిగా ఎస్. రాంబాబు వ్యవహరించారు.