మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలు ఉధృతమయ్యాయి.
మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలు ఉధృతమయ్యాయి. అఖిలపక్షాల పిలుపు మేరకు గురువారం ఉదయం నుంచి 48 గంటల బంద్ మొదలైంది. వర్తక, వ్యాపార కేంద్రాలు మూతబడ్డాయి. బస్సులు పట్టణంలోకి రాకుండా బైపాస్‌నుంచే వెళ్తున్నాయి. బంక్‌లు, బ్యాంక్‌లు పనిచేయటం లేదు. స్థానిక యువకులు ముగ్గురు సెల్‌టవర్ ఎక్కారు. డివిజన్‌గా ప్రకటించకుంటే దూకుతామని బెదిరిస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.