హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న దృశ్యం
ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు.
శ్రీకాకుళం : ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. అనివెట్టి మండపంలో జరిగిన ఈ లెక్కింపులో రూ.24,73,292ల ఆదాయం దేవస్థానానికి సమకూరింది. నోట్ల రూపంలో రూ.23,61,904, చిల్లర రూపంలో రూ.01,11,388, వెండి 1.100 కిలోలు, బంగారం 40 గ్రాములు, 9 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్యామలాదేవి, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, రామతీర్థాల ఈఓ పి.బాబూరావు, ఈవోలు వీఆర్‌ఆర్‌బి ప్రసాద్‌పట్నాయిక్, కేవీ రమణమూర్తి, ఎన్‌వీ రమణమూర్తి, టి.వాసుదేవరావు, వి.గురునాదరావులతో పాటు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఏడాది జూలై 5 తేదీన జరిగిన హుండీ లెక్కింపు ద్వారా దేవాలయానికి సుమారు రూ.28 లక్షల ఆదాయం సమకూరిన విషయం తెలిసిందే.