దర్శనానికి వెళ్తున్నామని.. అదృశ్యమయ్యారు | 2 girls missing in westgadavari | Sakshi
Sakshi News home page

దర్శనానికి వెళ్తున్నామని.. అదృశ్యమయ్యారు

Oct 28 2015 9:18 AM | Updated on Sep 3 2017 11:38 AM

దర్శనానికి వెళ్తున్నామని.. అదృశ్యమయ్యారు

దర్శనానికి వెళ్తున్నామని.. అదృశ్యమయ్యారు

పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమయ్యారు.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమయ్యారు. మూడురోజులుగా ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తణుకులో 9వ తరగతి, ఇంటర్ చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు ద్వారకా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నామని ఇంట్లో చెప్పి వెళ్లారు. వారు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు.. బంధువులు, స్నేహితులను విచారించారు. ఎక్కడా వారి జాడ లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అమ్మాయిలు ఉద్దేశ్యపూర్వకంగా వెళ్లారా లేక ఎవరైనా వారిని ట్రాప్ చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement