
బోనమెత్తిన తెలుగు సినీ నటి
తెలంగాణ ఎన్నారై ఫోరం (టీఎన్‌ఎఫ్) ఆధ్వర్యంలోలండన్‌లో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలకు సినీనటి పూనమ్ కౌర్ హాజరై బోనమెత్తారు.
రామచంద్రు తేజావత్ మాట్లాడుతూ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన ఎన్నారైలు తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ పెట్టుబడుల్లో భాగస్వామ్యులవ్వాలని పిలుపునిచ్చారు. విదేశాల్లో భారతీయ ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. స్వదేశంలో జరుపుకున్నట్టు సంప్రదాయ బద్దంగా అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపును జరుపుకున్న తీరు ప్రవాస తెలంగాణ బిడ్డలనే కాకుండా స్థానికులను కూడా మంత్రముగ్దులని చేసింది.


