breaking news
telangana bonalu festival
-
తెలంగాణ బోనం.. సాంస్కృతిక ప్రయాణం..
ఆషాఢమాసంలో బోనాల జాతర ఉత్సవాలకు నగరం సిద్ధమవుతోంది. పాతబస్తీలో ఈసారి బోనాల పండుగను ఘనంగా నిర్వహించడానికి భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఇప్పటికే సర్వసభ్య సమావేశం నిర్వహించింది. పాతబస్తీలో బోనాల సమర్పణ అనంతరం నిర్వహించే సామూహిక ఘటాల ఊరేగింపులో ప్రధాన పాత్ర వహించే శకటాలు, కళాకారుల విన్యాసాల కోసం సంబంధిత ఉత్సవాల నిర్వాహకులు పెద్ద ఎత్తున కళాకారులకు ఇప్పటికే బుకింగ్స్ ఇస్తున్నారు.(చదవండి: ఆదివాసీ కోయిల.. ! ఇంజనీర్ గ్రాడ్యుయేట్ కాస్తా.. ర్యాప్ సింగర్‌గా..)కళాకారుల నృత్య ప్రదర్శనలు.. ఈసారి ఉత్సవాల్లో కళాకారుల నృత్య ప్రదర్శనలు హైలెట్‌గా నిలువనున్నాయి. కళాకారులు ప్రదర్శించే హావభావాలను చూసే ప్రతి ఒక్కరూ భక్తిపారవశ్యంతో తన్మయత్వం పొందుతారు. ఘట స్థాపన ఊరేగింపు, పోతురాజుల నృత్యాలు, అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు తదితర కార్యక్రమాల్లో వివిధ రకాల అలంకరణల్లో, రూపాల్లో కళాకారుల నృత్య ప్రదర్శనలు భక్తులను ఎంతగానో అలరిస్తాయి. పాతబస్తీకి ప్రత్యేకం..నిజాం కాలం నుంచి ఇక్కడి అమ్మవారి దేవాలయాల్లో పూజలు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేసిన బోనాన్ని సమర్పించడం ఆనవాయితీ. తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే విధంగా నగరంలో ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి. తెలంగాణ జిల్లాల్లోనే అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలు పాతబస్తీ ప్రత్యేకతను చాటుతాయి.ఇతర రాష్ట్రాల కళాకారులకు ఉపాధిగా.. రాష్ట్రంలో జరిగే బోనాల ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, తమిళనాడుకు చెందిన కళాకారులు ఎక్కువగా పాల్గొంటారు. నగరంలో బోనాల జాతర ఉత్సవాల్లో కళాకారులు, వినూత్న తరహా సెట్టింగ్స్ కోసం నిర్వాహకులు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తారు. ఈసారి కళాకారులకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. దీంతో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. పాతబస్తీలోని ప్రముఖ దేవాలయాల నిర్వాహకులు కళాకారుల కోసం పోటీ పడుతున్నారు. దీంతో కొన్ని వందల కుటుంబాల కళాకారులకు ఈ బోనాల జాతర ఉత్సవాలు యేటా ఉపాధి కల్పిస్తున్నాయి. ఆకట్టుకునే రూపాలు, నృత్యాలు.. బోనాల జాతర ఉరేగింపులో కేరళ పులికళి, భేరీ నృత్యం, గరిగెలు, బేతాళ నృత్యం, ఒగ్గోళ్ల నృత్యం, బోనాలు, కాళికాదేవీ, లక్ష్మీదేవీ, వేంకటేశ్వర స్వామి, పొట్టి పోతరాజులు, సింహరథం, డప్పులోళ్లు, హనుమంతునిలో రాముడు, తయ్యం, దేవ నృత్యం, ఉరుములు, కొమ్ముకొయ్య, జడ కోలాటం, యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి శకటం.. అందులో ఏర్పాటు చేసే మూర్తులు, విజయవాడ కనకదర్గమ్మ దేవాలయ రథం.. అందులో కొలువుదీరే అమ్మవారి వేషధారణలోని కళాకారుల హావభావాలు.. ఇలా ఒకటేంటి పలు రకాల శకటాలు, కళాకారుల నత్యాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. (చదవండి: తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్ వరల్డ్ 2025లో..) -
సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో కన్నుల పండువగా బోనాలు
ఈ ఏడాది కోవిడ్ నిబంధలను సడలించడంతో సింగపూర్ బోనాల పండుగ వేడుకలు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో కన్నుల పండువగా జరిగాయి. ఇక్కడి సుంగే కేడుట్ లోని శ్రీ అరస కేసరి శివన్ దేవాలయంలో సింగపూర్ ప్రభుత్వం, ఆలయ నిబంధనలకు లోబడి ఘనంగా బోనాలు సమర్పించారు. స్థానిక నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. సమస్త ప్రజలపై ఆ మహంకాళి తల్లి ఆశిస్సులు ఉండాలని, ప్రపంచం కరోనా కోరల నుంచి పూర్తిగా ఉపశమనం పొందాలని సభ్యులు ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు. వందల మంది భక్తులు పాల్గొన్న ఈ బోనాల ఊరేగింపులో బోనాలు, తొట్టెలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ బోనాల పండుగను సింగపూర్‌కు ఆరేళ్ల క్రితం పరిచయం చేయడం ద్వారా టీసీఎస్ఎస్(TCSS) పేరు చరిత్రలో నిలిచింది. అది సొసైటీకి దక్కిన అదృష్టంగా వారు భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయడంలో ఏకైక తెలంగాణ సంస్థ, టీసిఎస్ఎస్ అని తెలిపారు. ఈ ఏడాది బోనం సమర్పించిన వారిలో బండ శ్రీదేవి మాధవ రెడ్డి, గోనె రజిత నరేందర్ రెడ్డి , గడప స్వాతి రమేశ్, మద్దుకుంట్ల స్వరూప రాజు, గదంశెట్టి స్వరూప్, దార అలేఖ్య ఉన్నారు. వీరితో పాటు ఫణి రోజా రమణి అమ్మవారికి కోసం తొట్టెలను స్వయంగా పేర్చి తీసుకువచ్చింది. ఈ వేడుకలకు సమన్వయకర్తలుగా నంగునూరి సౌజన్య, గర్రెపల్లి కస్తూరి, ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు వ్యవహరించారు. అదే విధంగా సంబరాలు విజయవంతంగా జరిగేందుకు సహయం అందించిన దాతలకు, మై హోమ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల పై ఉజ్జయని మహంకాళీ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియ జేశారు. -
బోనమెత్తిన తెలుగు సినీ నటి
రాయికల్(కరీంనగర్ జిల్లా): తెలంగాణ ఎన్నారై ఫోరం (టీఎన్ఎఫ్) ఆధ్వర్యంలోలండన్లో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలకు సినీనటి పూనమ్ కౌర్ హాజరై బోనమెత్తారు. యుకే నలుమూలల నుంచి సుమారు 700 మందికి పైగా తెలంగాణ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్రం నుంచి రామచంద్రు తేజావత్ (రిటైర్డ్ ఐఏఎస్), స్థానిక ఎంపీలు వీరేంద్రశర్మ, సీమ మల్హోత్రా, బాలాజీ (ఇండియన్ హైకమిషనర్-లండన్) ముఖ్య అతిధులుగా హాజరై ప్రసంగించారు. రామచంద్రు తేజావత్ మాట్లాడుతూ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన ఎన్నారైలు తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ పెట్టుబడుల్లో భాగస్వామ్యులవ్వాలని పిలుపునిచ్చారు. విదేశాల్లో భారతీయ ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. స్వదేశంలో జరుపుకున్నట్టు సంప్రదాయ బద్దంగా అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపును జరుపుకున్న తీరు ప్రవాస తెలంగాణ బిడ్డలనే కాకుండా స్థానికులను కూడా మంత్రముగ్దులని చేసింది.