పునీత్ను కీలక పదవికి నామినేట్ చేసిన ఒబామా | Obama nominates Indian-American to key diplomatic position | Sakshi
Sakshi News home page

పునీత్ను కీలక పదవికి నామినేట్ చేసిన ఒబామా

Sep 11 2013 9:05 AM | Updated on Sep 17 2018 5:10 PM

యూఎస్ పోలిటికల్ మిలటరీ ఎఫైర్స్లో అసిస్టెంట్ సెక్రటరీ పదవికి భారతీయ అమెరికన్ పునీత్ తల్వార్ను ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా నామినేట్ చేశారు.

యూఎస్ పోలిటికల్ మిలటరీ ఎఫైర్స్లో అసిస్టెంట్ సెక్రటరీ పదవికి భారతీయ అమెరికన్ పునీత్ తల్వార్ను ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా నామినేట్ చేశారు. ఈ మేరకు అధ్యక్ష భవనం వైట్ హౌస్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. పునీత్ను ఆ పదవిలో నియమిస్తూ ఒబమా మంగళవారం నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ఆయన నియమాకాన్ని సెనేట్ ఆమోదించవలసి ఉందని పేర్కొంది.

 

ఆయనతోపాటు మరో 29 మందిని ఒబామా దేశంలోని వివిధ ఉన్నతస్థానాల్లో నియమించారని చెప్పింది. వీరంతా తమ విధులను అంకితభావంతో పని చేస్తూ, వారివారి ప్రతిభ పాటవాల ద్వారా దేశ పురోగతికి పాటుపడతారని ఒబామా ఈ సందర్బంగా ఆకాంక్షించారని వైట్ హౌస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దేశంలో అత్యంత కీలకమై అటువంటి పదవిలో నియమితులైన రెండవ వ్యక్తిగా పునీత్ రికార్డు సృష్టించారు.

 

గతంలో భారతీయ సంతతికి చెందిన నిషా దేశాయ్ బిశ్వాల్ను దక్షిణ మరియ మధ్య ఆసియా దేశాల అసిస్టెంట్ సెక్రటరీగా ఒబామా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.అంతర్జాతీయ భద్రత, మిలటరీ ఆపరేషన్స్, డిఫెన్స్ స్ట్రాటజీ, ప్రణాళిక, రక్షణ వాణిజ్యం తదిరత అంశాలను పునీత్ తల్వార్ పర్యవేక్షించనున్నారు. మధ్య ప్రాచ్యా దేశ వ్యవహారాల ముఖ్య సలహాదారునిగా గత నాలుగేళ్లుగా ఒబామా వద్ద పునీత్ విధులు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement