నాట్స్ సంబరాల్లో 'డీజే' | DJ team at NATS celebrations | Sakshi
Sakshi News home page

నాట్స్ సంబరాల్లో 'డీజే'

Jul 3 2017 11:14 AM | Updated on Sep 5 2017 3:06 PM

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) అంగరంగ వైభవంగా చికాగోలోని శ్యాంబర్గ్లో నిర్వహిస్తున్న అమెరికా తెలుగు సంబరాల్లో 'డీజే' టీం సందడి చేసింది.

షాంబర్గ్:  
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) అంగరంగ వైభవంగా చికాగోలోని శ్యాంబర్గ్లో నిర్వహిస్తున్న అమెరికా తెలుగు సంబరాల్లో 'డీజే' టీం సందడి చేసింది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. అమెరికాలో తెలుగువారంతా ఒక్క చోట చేరి ఇలా సంబరాలు చేసుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ అన్నారు. డీజే చిత్రయూనిట్ సభ్యులు, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజు, కామెడీ విలన్ సుబ్బరాజు, హీరోయిన్ పూజా హెగ్డేలు నాట్స్ సంబరాల్లో పాల్గొన్నారు. నాట్స్ చైర్మన్ సామ్ మద్దాళి, ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ, సంబరాల కన్వీనర్ రవి ఆచంటలు అతిధులను సాదరంగా సత్కరించారు.

మోహన కృష్ణ మన్నవ మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు సజావుగా జరగటానికి ఎంతో విలువైన కాలాన్ని వెచ్చించి నాట్స్ ను ముందుకు నడిపిస్తున్న బోర్డుకి ధ్యనవాదాలు తెలుపారు. నాట్స్ కార్య నిర్వహణ సభ్యులను, స్టేట్ కోఆర్డినేటర్లను, జోనల్ వీక్ ప్రెసిడెంట్లను ప్రత్యేకంగా అభినందించి అందరినీ వేదిక పై పిలిచి, సభకు పరిచయం చేశారు.
నిర్విఘ్నంగా  సంబరాలను నిర్వహిస్తున్న సంబరాల కమిటీ సేవలను ప్రత్యేకంగా అభినందించారు.
 
అమెరికా గడ్డ పై వృత్తి, వ్యాపార రంగాల్లో పైకి ఎదిగిన యువ తెలుగు వ్యాపారవేత్తలను టీడీపీ నేత రేవంత్ రెడ్డి అభినందించారు. తెలుగు వారు అమెరికా రాజకీయాల్లోకి రావాలని పిలుపు నిచ్చారు.

అనంతరం, ఇండియన్ ఐడల్ సీజన్ 9 విజేత రేవంత్ మ్యూజిక్ హంగామా
స్థానిక కళాకారులు, చిన్నారులు చేసిన మనలోని మనిషి నాటిక చూస్తున్న ఆహూతుల కళ్ళు చెమర్చాయి. చిన్న పిల్లలు చేసిన ప్రయత్నాన్ని పలువురు అభినందించారు. అలాగే గోదా కళ్యాణం ఆముక్తమాల్యద ఆహూతులను కట్టిపడేశాయి. ఇటీవల మరణించిన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావుకు, సాహితీ వేత్త, కవి, జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి లకు నాట్స్ ఘనంగా నివాళులర్పించింది.

ఆలీ, పృధ్వీ అండ్ టీమ్ చేసిన కామెడీ నవ్వుల పువ్వులు పూయించింది. వారి కామెడీకి విశేష స్పందన లభించింది. పగలనక రాత్రనక కష్టపడుతున్న వాలంటీర్ల సేవలన అందరూ అభినందించారు. సంబరాల్లో రెండో రోజు చివరగా వచ్చిన రేవంత్ టీమ్ హుషారైన పాటలతో అందరిని చిందులు వేయించారు. పాత కొత్త పాటలతో రేవంత్ టీమ్ చేసిన మ్యూజిక్ హంగామా తెలుగువారికి అంతులేని సంతోషాలు పంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement