అదృశ్యమైన యువతి హత్య!

Young woman Killed  - Sakshi

లభ్యంకాని మృతదేహం

సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు

ఇద్దరు నిందితులకు రిమాండ్‌

బంట్వారం రంగారెడ్డి : అదృశ్యమైన ఓ యువతి హత్యకు గురైంది. ఈమేరకు పోలీసులు ఇద్దరు నిందితులను రిమాండుకు తరలించారు. పోలీసులు, మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని బొప్పునారం గ్రామానికి చెందిన మీన(23) నగరంలోని యశోద ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తూ కొంపల్లిలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉండేది. అదే గ్రామానికి చెందిన నర్సింలు సైతం కొంపల్లిలో ఉండేవాడు. అయితే, మీన జూన్‌ 12న స్వగ్రామం బొప్పునారం వచ్చింది.

తిరిగి మరుసటి రోజు హైదరాబాద్‌కు వెళ్లింది. ఆమె చివరగా తన తల్లి బిచ్చమ్మతో అదే నెల 25న ఫోన్‌లో మాట్లాడింది. ఆ తర్వాత మీన ఫోన్‌ స్చిఛ్‌ఆఫ్‌లో ఉంది. కూతురి సమాచారం తెలియకపోవడంతో బిచ్చమ్మ కొంపల్లిలోని హాస్టల్‌కు వెళ్లి వాకబు చేసింది. అక్కడ మీన లేదని తెలుసుకొని ఆందోళనకు గురై గతనెల 21న బంట్వారం ఠాణాలో ఫిర్యాదు చేసింది.

ఈమేరకు పోలీసులు అప్పట్లో మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు. ఎస్‌ఐ శేఖర్‌గౌడ్‌ దర్యాప్తు ప్రారంభించారు. అయితే, బొప్పునారం గ్రామానికి చెందిన నర్సింలుపై అనుమానం వ్యక్తం చేస్తూ అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. అతడి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా హైదరాబాద్‌లోనూ దర్యాప్తు చేశారు.   

సీసీ ఫుటేజీల ఆధారంగా..   

అయితే, సీసీ ఫుటేజీల ఆధారంగా మీన హత్యకు గురైనట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు నగరంలోని మూసీ పరివాహక ప్రాం తంలో గాలించిన మృతదేహం లభించలేదు. న ర్సింలు మీనను తన గదిలో చంపేసి గోనెసంచిలో మృతదేహాన్ని వేసుకొని బైక్‌పై తీసుకెళ్లి మూసీలో పడేసినట్లు ఆనవాళ్లను పోలీసులు గుర్తించినట్లు డీఎస్పీ శిరీష తెలిపారు.

ఈమేరకు నిందితుడు నర్సింలుతో పాటు అతడికి సహకరించిన సో దరుడు మోహన్‌దాస్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా బొప్పునారంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top