వివాహిత మృతి.. భర్తపై అనుమానం | Woman Suspicious Murder In Krishna District | Sakshi
Sakshi News home page

వివాహిత మృతి.. భర్తపై అనుమానం

Jul 7 2019 3:57 PM | Updated on Jul 7 2019 4:07 PM

Woman Suspicious Murder In Krishna District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కృష్ణా : గన్నవరంలో మండలంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపుతోంది. ఏలూరు సమీపంలోని పంట తూములో గుర్తించిన ఆ మృతదేహాన్ని కంకిపాడుకు చెందిన కారుమూడి శిరీష(32)గా గుర్తించారు. గత నెల 29న ఆవుటపల్లి పిన్నమనేని హాస్పిటల్‌కు వచ్చి శిరీష మిస్‌ అయినట్లు తెలుస్తోంది. తన భార్య కనిపించడం లేదని ఆత్కూరు పోలీస్‌స్టేషన్‌లో శివ నాగరాజు ఫిర్యాదు చేశాడు. భర్తే శిరీషను హతమార్చి ఉంటాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement