యువతికి దర్శకుడి వేధింపులు | Woman Software Engineer lodged complaint against Short film director | Sakshi
Sakshi News home page

యువతికి దర్శకుడి వేధింపులు

Dec 24 2017 9:47 AM | Updated on Sep 26 2018 6:09 PM

Woman Software Engineer lodged complaint against Short film director - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యోగి అనే దర్శకుడు ఓ మహిళకు అసభ్య మెసేజ్‌లు పంపి వేధిస్తున్నాడని, బాధితురాలి ఫిర్యాదు మేరకు అతనిని అరెస్టు చేస్తామని మాదాపూర్‌ డీసీపీ పి.విశ్వప్రసాద్‌ తెలిపారు. గచ్చిబౌలిలోని మాదాపూర్‌ డీసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. షార్ట్‌ఫిల్మ్‌లో నటించే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హారిక ఈ నెల 20న గచ్చిబౌలి ఉమెన్‌ పీఎస్‌లో బీహెచ్‌ఈఎల్‌లో ఉండే ముత్యాల యోగి కుమార్‌ వేధిస్తున్నారని ఫిర్యాదు చేసిందని తెలిపారు. షీటీమ్స్‌ ఇంచార్జీ, మాదాపూర్‌ అడిషనల్‌ డీసీపీ గంగిరెడ్డి విచారణ చేపట్టగా అసభ్య మెజేస్‌లు హారికతో పాటు ఆమె భర్తకు పంపినట్లు వెల్లడైందన్నారు. యోగి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని చెప్పారు.  

విచారణ సమయంలో అడిషనల్‌ డీసీపీ యోగిని బూటుకాలితో తన్నినట్లు టీవీ చానళ్లలో వచ్చిందన్నారు. ఆ వీడియోలో వాస్తవం ఎంతుందో విచారణ చేపటాలని డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆదేశించారు. డీసీపీ విశ్వప్రసాద్‌ను విచారణ అధికారిగా నియమించారు. ఇదిలా ఉండగా యోగిపై గతంలో జూబ్లిహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ విషయంపై బాధితురాలు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. యోగి తనకు సంవత్సరం క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయమని పేర్కొంది. అతనికి అనేకసార్లు ఆర్థికసాయం చేశానన్నారు. స్నేహితునిగా నటిస్తూనే నన్ను లొంగదీసుకోవాలనే ఆలోచన ఉన్నట్లు స్నేహితుల ద్వారా తెలుసుకుని కొద్ది రోజలుగా దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించానన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement