భర్త హత్యకు భార్య సుపారీ | WIfe Supari to Killer For Husband Murder in Karnataka | Sakshi
Sakshi News home page

భర్త హత్యకు భార్య కుట్ర?

Aug 17 2019 5:35 AM | Updated on Aug 17 2019 5:35 AM

WIfe Supari to Killer For Husband Murder in Karnataka - Sakshi

కిరాయి రౌడీని పోలీసులకు పట్టించిన భర్త  

బెంగళూరు, హొసూరు: ఇదేదో సినిమా కథ కాదు, కానీ కొంచెం అలాగే ఉంటుంది. జిల్లా కేంద్రం క్రిష్ణగిరి సమీపంలో రౌడీల నుంచి భర్తను హత్య చేసేందుకు యత్నించిన ఘటనలో రౌడీని మత్తూరు పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. క్రిష్ణగిరి జిల్లా మత్తూరు అణ్ణానగర్‌కు చెందిన మాదేష్‌ (32). ఇతని భార్య (27). వీరికి  10 ఏళ్ల క్రితం పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలున్నారు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గలాటాలు జరుగుతున్నాయి. దీనితో భర్తను అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. అందుకు అత్తిపల్లంకు చెందిన ప్రముఖ రౌడీ విష్ణును సంప్రదించి రూ. 2 లక్షలకు కిరాయి కుదుర్చుకుని రూ. 30 వేలు అడ్వాన్స్‌ డబ్బులిచ్చింది. 

భర్తను కలిసిన రౌడీ  
రౌడీ విష్ణు మనసులో మరో ఆలోచన పుట్టింది. ఆమె భర్త మాదేష్‌ను కలిసి నీ భార్య నిన్ను హత్య చేసేందుకు నాకు డబ్బులిచ్చింది, నాకు రూ. 3 లక్షలు ఇవ్వు. నిన్న హత్య చేసేందుకు యత్నిస్తాం, ఆ సమయంలో నీవు తప్పించుకొని వెళ్లిపో అని తెలిపాడు.  దీంతో జాగ్రత్తపడిన మాదేశ్‌ తన అనుచరులు 10 మందిని తీసుకొని వెళ్లి విష్ణును పట్టుకుని మత్తూరు పోలీసులకు అప్పగించాడు.  పోలీసులు విష్ణును అతన్ని అరెస్టు చేసి నిజంగానే భర్తను హత్య చేసేందుకు ఆమె డబ్బులిచ్చిందా, లేక మాదేష్‌ వద్ద డబ్బులు లాక్కొనేందుకు ఈ నాటకమాడారా అన్న విషయంపై విచారణ జరుపుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement