ముగ్గురిని మింగిన బావి పూడ్చివేత

The Well Which Cause The Death Of 3 Young Men Is Closed In Adilabad District - Sakshi

సాక్షి, సిర్పూర్‌: కౌటాల మండలంలోని ముత్తంపేట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కారెం మహేష్, గాదిరెడ్డి రాకేష్, మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి మండలంలోని శికిరం గ్రామానికి చెందిన సొక్కల శ్రీనివాస్‌లు బావిలో దిగి ఊపిరాడక బుధవారం మృతి చెందారు. ఆరుగంటల పాటు అధికారులు శ్రమించి జేసీబీ, ప్రోక్లియిన్‌లతో బావి చూట్టు తవ్వకాలు జరిపారు. బావిలో ఆక్సిజన్‌ నింపి బావిలోకి దిగి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం బావి చుట్టూ తవ్విన మట్టిని జేసీబీల సహాయంతో పూడ్చివేశారు. రాత్రి కావడంతో పూర్తిగా పూడ్చివేత పనులు నిర్వహించలేదు. బావిని పూర్తిగా పూడ్చివేస్తామని అధికారులు తెలిపారు.  

కంటతడి పెట్టిన ముత్తంపేట      
ముత్తంపేట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బంధువులు బావిలో దిగి మృతి చెందడంతో గ్రామంలోని యువకులు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. బావిలో దిగి ముగ్గురు మృతి చెందిన వార్త మండలంలో సంచలనం రేపడంతో గురువారం ఉదయం యువకుల అంత్యక్రియల్లో మండలంలోని ఆయా గ్రామాల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చి వారి మృతదేహాలకు నివాళ్లు అర్పించారు. ఇద్దరు యువకుల మృతదేహాలకు ఒకేసారి గ్రామంలో చివరి అంతిమ యాత్ర నిర్వహించడంతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. అందరితో కలిసి మెలిసి ఉండే యువకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు బోరునా విలపించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top