వైజాగ్‌ యువతి అదృశ్యం | Sakshi
Sakshi News home page

వైజాగ్‌ యువతి అదృశ్యం

Published Thu, Sep 5 2019 11:17 AM

Vizag Teen Girl Missing in Hyderabad - Sakshi

బంజారాహిల్స్‌: శుభకార్యం కోసం వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వైజాగ్‌ అరిలోవా ప్రాంతానికి చెందిన కుమారి(17) డిగ్రీ చదువుతోంది.ఐదు రోజుల క్రితం ఆమె జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరిలో ఉంటున్న తన పెద్దమ్మ రత్నమ్మ ఇంటికి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం   గాజులు కొనుక్కునేందుకు వెళుతున్నట్లు చెప్పి బయటికి వచ్చింది. సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టినా ఫలితం లేకపోవడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement