కోడలు హత్య: మామ అరెస్టు

Uncle Arrest in Daughter in law Murder Case Tamil nadu - Sakshi

చెన్నై,సేలం: కోడలిని హత్య చేసిన మామను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లా తంబంపట్టి సమీపంలో ఉలిపురం నరికరడు ప్రాంతానికి చెందిన అరివళగన్‌ (45) ఒక కో–ఆపరేటివ్‌ సొసైటీలో సేల్స్‌ మన్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య అముద (40). వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అరిళగన్‌ ఎప్పటిలానే సోమవారం ఉదయం పనికి వెళ్లిపోయాడు. అముద ఒక్కటే ఇంట్లో ఉంది. మధ్యాహ్నం అరివళగన్‌ తండ్రి పళని (63) ఇంటికి వచ్చాడు. తర్వాత ఇంటిలోపల గడియపెట్టాడు. అముద కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న ఇరుగుపొరుగు వారు తలుపులు తట్టినా తెరుచుకోలేదు.

కాసేపటికి ఇంటి  లోపలి నుంచి పళని బయటకు వచ్చాడు. తన కోడలిని చంపినట్టు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పళనిని అరెస్టు చేశారు. తర్వాత విగత జీవిగా పడి ఉన్న అముద మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిమిత్తం ఆత్తూరు జీహెచ్‌కు తరలించారు.పోలీసుల విచారణలో కోడలు మరో వ్యక్తితో అక్రమం సంబంధం కలిగి ఉన్నట్టు తెలియడంతో తాను ఆమెను హత్య చేసినట్టు అరివళగన్‌ అంగీకరించాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top