అత్యాచారం చేసి జైలుకి, వెంటనే బెయిల్‌పై వచ్చి పెళ్లి

Two Days After Arrest, Karnataka Man Accused Of Raping Minor Given Bail - Sakshi

బెంగళూరు : ఓ మైనర్‌ బాలికపై అత్యాచారం చేసి, జైలుకెళ్లాడు. రెండు రోజుల్లోనే బెయిల్‌పై వచ్చిన పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ ప్రబుద్ధుడు. మళ్లీ పెళ్లి చేసుకునేది ఎవరినో కాదు, బాధితురాలి సోదరినే. కోర్టు సైతం నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసి, వివాహానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ సంఘటనంతా కర్నాటకలోని చిక్కబల్లపుర్‌లో జరిగింది. 

జిల్లాలోని గౌరిబిదనూర్‌ తాలుకాలోని గోటకానపుర గ్రామానికి చెందిన శివన్న అనే వ్యక్తి ఓ 15 ఏళ్ల బాలికపై అ‍త్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి పాల్పడిన సమయంలో అతను పీకల్లోతు మత్తులో ఉన్నాడు. ఫుల్‌గా డ్రింక్‌ చేసిన శివన్న ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసిన తర్వాత ఆ గ్రామం నుంచి పారిపోయాడు. గ్రామ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుతో, అదే రోజులు పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. బుధవారం అతన్ని అదుపులోకి తీసుకుని, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ(పోస్కో) చట్టం కింద కేసు నమోదు చేశారు. 

అయితే నేడు అతను పెళ్లి. పెళ్లి కూడా అదే గ్రామానికి చెందిన బాధితురాలి సోదరినే చేసుకుంటున్నాడు. నిందితుడు అభ్యర్థన మేరకు అతనికి కోర్టు బెయిల్‌ ఇచ్చింది. చిక్కబల్లపుర్‌ జిల్లా, సెషన్స్‌ జడ్జి ఎస్‌హెచ్‌ కోర్రడి అతనికి బెయిల్‌ మంజూరు చేస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు.  శనివారం నిందితుడి పెళ్లి ఉన్నట్టు పోలీసు అధికారులు ధృవీకరించారు. ‘పోస్కో కేసుల్లో బెయిల్‌ ఇవ్వడం అసాధారణం. కానీ బెంగళూరులో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. చట్టం మెజిస్ట్రేట్‌ చేతుల్లో ఉంటుందని జడ్జీలు చెప్పారు. అయితే మైనర్‌ సంబంధిత కేసుల్లో నిందితుడికి అసలు బెయిల్‌ ఇవ్వకూడదని చట్టం ఉంది’ అని గ్లోబల్‌ కన్సర్న్స్‌ ఇండియా డైరెక్టర్‌ బ్రిండా అడిగే చెప్పారు. నిందితుడికి రెండు రోజుల్లోనే బెయిల్‌ ఇవ్వడంపై పెద్ద ఎత్తున్న విమర్శలు చెలరేగుతున్నాయి. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top