‘విదేశాల్లో ఎంజాయ్‌ చేయాలని ఉంది’

twist in short film director harassment case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: షార్ట్‌ ఫిలిం దర్శకుడు ముత్యాల యోగికుమార్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హారిక కేసు మరో మలుపు తిరిగింది. తాను ఏ తప్పు చేయలేదంటూ నిందితుడు యోగి.. పోలీసులు కొన్ని మొబైల్‌ స్క్రీన్‌ షాట్లు పంపించాడు. హారిక తనకు పంపిన మెసేజ్‌లను స్క్రీన్‌ షాట్లు తీశాడు. ‘నేను వ్యక్తిగతంగా ఆనందంగా లేను. జీవితంపై నాకు విసుగొచ్చింది. విదేశాల్లో ఎంజాయ్‌ చేయాలని ఉంది. సంతోషంగా లేనప్పుడు విలువలు ఎందుకు పాటించాల’ని ఈ మెసేజుల్లో ఉంది. షీటీమ్స్‌ ఇంచార్జీ, మాదాపూర్‌ అడిషనల్‌ డీసీపీ గంగిరెడ్డి తనను కాలితో తన్నిన వీడియో తీసింది కూడా ఆమేనని యోగి వెల్లడించాడు.

కాగా, అసభ్య మెసేజ్‌లు పంపి తనను యోగి వేధిస్తున్నాడని హారిక ఈ నెల 20న గచ్చిబౌలి ఉమెన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. విచారణ సమయంలో యోగిని అడిషనల్‌ డీసీపీ గంగిరెడ్డి బూటుకాలితో తన్నిన దృశ్యాలు టీవీ చానళ్లలో రావడంతో ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు హారిక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిజానిజాలు తెలుసుకునేందుకు అన్నికోణాల్లోనూ విచారణ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top