ముగ్గురి సజీవ దహనం | Three people was burned alive | Sakshi
Sakshi News home page

ముగ్గురి సజీవ దహనం

Aug 7 2018 1:42 AM | Updated on Aug 7 2018 1:42 AM

Three people was burned alive - Sakshi

రాజమ్మ (ఫైల్‌), కుమారస్వామి(ఫైల్‌)

ఆత్మకూరు(పరకాల): తన తండ్రితో ఓ మహిళ వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆ మహిళపై అతడు పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో ఆమెతోపాటు అడ్డుకోబోయిన అతడి తండ్రి సజీవ దహనమయ్యారు. అదే సమయంలో మంటలు ఎగిసిపడి ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో యువకుడి నానమ్మ కూడా సజీవ దహనమైంది. వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండలం కంఠాత్మకూరులో ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కంఠాత్మకూరుకు చెందిన మామిడి కుమారస్వామి(50) భార్యాపిల్లలతో హన్మకొండలో ఉంటూ ప్లంబర్‌ పనిచేసుకుంటున్నాడు.

ఈ క్రమంలో కంఠాత్మకూరుకు సమీప గ్రామమైన పులుకుర్తికి చెందిన పోతరాజు సుమలతతో కుమారస్వామికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. సుమలతతో ఉంటూ కుమారస్వామి కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో అతడి కుమారుడు కార్తీక్‌ కక్షపెంచుకున్నాడు. ఆదివారం రాత్రి తన తండ్రి సుమలతతో కంఠాత్మకూరులోనే ఉన్నాడని తెలుసుకొని నేరుగా ఇంటికి పెట్రోల్‌ డబ్బాతో వెళ్లి సుమలతపై పెట్రోల్‌ చల్లాడు. కుమారస్వామి అడ్డుకోబోగా అతడిపై కూడా పెట్రోల్‌ పడింది.

వెంటనే సుమలతకు కార్తీక్‌ నిప్పంటించగా, మంటలార్పే ప్రయత్నంలో కుమారస్వామికి కూడా అంటుకొని సజీవ దహనమయ్యారు. అదే సమయంలో మంటల కారణంగా ఇంట్లో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో కుమారస్వామి తల్లి మామిడి రాజమ్మ(70) కూడా మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనలో కుమారస్వామి తండ్రి లింగయ్య తప్పించుకొని స్వల్పగాయాలతో ప్రాణాలు దక్కించుకున్నాడు. కుమారస్వామి సోదరి కోమల ఫిర్యాదు మేరకు ఎస్సై మోహన్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement