చీటింగ్‌ కేసులో ముగ్గురు అరెస్టు | Three Arrest In CHeating Case Prakasam | Sakshi
Sakshi News home page

చీటింగ్‌ కేసులో ముగ్గురు అరెస్టు

May 22 2018 12:26 PM | Updated on Aug 20 2018 4:27 PM

Three Arrest In CHeating Case Prakasam - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న సీఐ జి.రామారావు

చీరాల అర్బన్‌: వ్యక్తిని నమ్మించి మోసం చేసి ఆపై అతనిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో ఒక యువతితో పాటు మరో ఇద్దరిని టూటౌన్‌ సీఐ జి.రామారావు, ఎస్సై త్యాగరాజు సోమవారం అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా సీఐ జి.రామారావు మీడియాతో మాట్లాడుతూ కంపా మాలతి, శివకృష్ణలు కలిసి  గుంటూరుకు చెందిన ఇస్మాయిల్‌ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుని అతనని నమ్మించి పేరాలలోని కంపా స్రవంతి ప్రియ ఇంటికి పిలిపించారు.

ఆపై అతనిని నిర్భందించి అతని వద్ద నుంచి బలవంతంగా ఏటీఎం నుండి రూ.13వేలు తీసుకుని ఇంకా లక్ష రూపాయలు ఇవ్వకుంటే చంపుతామని, పరువు తీస్తామని బెదిరించారన్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంపా స్రవంతి ప్రియ, కుంభా ప్రకాష్, కావాటి కిరణ్‌లను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ.3వేల నగదు, మూడు సెల్‌ఫోన్‌లు రికవరీ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. ముద్దాయిలను పట్టుకోవడంలో సహకరిం చిన టి.శ్రీనివాసరావు, బి.అచ్చయ్య, మల్లేష్, నరేం ద్రలను డీఎస్పీ జి.ప్రేమ్‌కాజల్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement