బాల్క సుమన్ ఇంట్లో చోరీ

Theft in trs mp balka suman house at mancherial - Sakshi

సాక్షి, మంచిర్యాల : పెద్దపల్లి టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఇంట్లో చోరీ జరిగింది. మంచిర్యాల పట్టణంలోని గౌతమ్‌నగర్‌లోని ఎంపీ సుమన్ నివాసం ఉంది. ఎంపీ ఇంటితో పాటు మరో రెండు ఇళ్లల్లో  శుక్రవారం అర్థరాత్రి చోరీ జరిగినట్లు సమాచారం. ఎంపీ ఇంట్లో రూ. లక్ష నగదును దొంగలు అపహరించినట్లు తెలుస్తోంది.  బాల్క సుమన్‌ సహా మిగతా ఇంటి యజమానులు అందుబాటులో లేకపోవడంతో ఎంత మొత్తంలో చోరీ జరిగిందో తెలియడం లేదు. చోరీ ఘటనను పోలీసులు గోప్యంగా దర్యాప్తు చేస్తున్నారు. రెండు నెలల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో రెండో సారి దొంగతనం జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top