మాజీ ప్రధానికి ఐదేళ్ల జైలు | Thailand Former Prime Minister Sentenced to Five Year Jail | Sakshi
Sakshi News home page

థాయ్‌ మాజీ ప్రధాని ఇంగ్లక్‌కు ఐదేళ్ల జైలు

Sep 28 2017 1:44 AM | Updated on Sep 28 2017 2:02 AM

Thailand Former Prime Minister Sentenced to Five Year Jail

బ్యాంకాక్‌ : వరి సబ్సిడీ పథకంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందన్న ఆరోపణ లపై  థాయ్‌లాండ్‌ మాజీ ప్రధాని ఇంగ్లక్‌ షినవత్రాకు ఐదేళ్ల జైలుశిక్షను విధిస్తూ బుధవారం ఓ థాయ్‌ కోర్టు తీర్పునిచ్చింది. కాగా, ఇంగ్లక్‌ గత నెలలో దేశం విడిచి పారిపోయారు. థాయ్‌లాండ్‌లో 2011లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరి సబ్సిడీ పథకం హామీతో ఇంగ్లక్‌కు చెందిన ఫూ థాయ్‌ పార్టీ అధికారం చేపట్టింది. అనంత రం రైతులకు 50శాతం అధికంగా డబ్బు చెల్లించి ఇంగ్లక్‌ ప్రభుత్వం వరిని కొనుగోలు చేసింది. ఈ ప్రభావం ఎగుమతులపై పడి అప్పటివరకు వరి ఎగుమతిలో ప్రపంచం లోనే అగ్రస్థానంలో ఉన్న థాయ్‌లాండ్‌ తన స్థానాన్ని కోల్పోయింది. ఈ పథకంలో అవినీతి జరుగుతోందని హెచ్చరించినప్ప టికీ ఇంగ్లక్‌ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని ప్రాసిక్యూ టర్లు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement