‘జయరాం కేసు’లో విచారణకు హాజరైన టీడీపీ నేత

TDP Leader Attended For Enquiry In Chigurupati Jayaram Murder Case - Sakshi

హైదరాబాద్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డితో సన్నిహిత సంబం ధాలున్నాయన్న వాటిపై ఆరా తీసేందు కు, ఇద్దరి మధ్య ఎలాంటి లావాదేవీలు నడిచాయన్నదాన్ని తెలుసుకునేందుకు నగర టీడీపీ సీనియర్‌ నేత, తెలంగాణ టీడీపీ టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు బీఎన్‌.రెడ్డిని ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌ పోలీసులు విచారించారు. ఈ కేసు దర్యాప్తు అధికారి, బంజారాహిల్స్‌ ఏసీపీ కె.ఎస్‌.రావు కార్యాలయంలో గంటన్నరపాటు బీఎన్‌.రెడ్డిని విచారించిన పోలీసులు రాకేష్‌రెడ్డి ఎలా తెలుసు, ఎప్పటి నుంచి పరిచయం,అతడిని రాయదుర్గం సీఐ రాంబాబు వద్దకు తీసుకెళ్లడానికి గల కారణాలేంటి అన్న మూడు అంశాలపైనే విచారణ చేశారు.

ఇరవై రోజుల కిందట బీఎన్‌.రెడ్డి తన స్నేహితుడు రాకేశ్‌రెడ్డిని రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ సీఐ రాంబాబుతో గంటపాటు మంతనాలు జరిపారు. రాంబాబు తనకు బాగా తెలుసునని ఏ పనై నా చేసిపెడతాడంటూ బీఎన్‌.రెడ్డి నమ్మించడం తో రాకేశ్‌రెడ్డి తన కారులోనే రాయదుర్గం పీఎస్‌కు అతనితో వెళ్లాడు. జయరాం సెటిల్మెంట్‌లో తనకు సహకరించాలని రాకేశ్‌రెడ్డి సీఐ రాంబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవలి విచారణ లో రాంబాబు ఇదే విషయాన్ని వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌.శ్రీనివాస్‌కు తెలియజేశారు. దీంతో బీఎన్‌.రెడ్డిని విచారణకు హాజరుకావాలని శుక్రవా రం రాత్రి ఫోన్‌ చేయగా ఆయన ఆదివారం విచారణకు వచ్చారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో తాను ఖైరతాబాద్‌ టికెట్‌ కోసం ప్రయత్నిస్తుండగా అప్పుడు రాకేశ్‌రెడ్డి పరిచయం అయ్యాడని ఆయన కూడా టీడీపీ నేత కావడంతో పలుమార్లు మాట్లాడినట్లు, అంతకుమించి తమ మధ్య ఏమీలేదని బీఎన్‌.రెడ్డి పోలీసులకు తెలిపారు. మొత్తానికి ఈ కేసులో పలువురు టీడీపీ నేతలు కూడా ఉన్నారని తెలుస్తోంది. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top